![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -159 లో.. ప్రేమ ఈ రెండు వేల్లలో ఒక వేలు పట్టుకోమని ధీరజ్ అనగానే ప్రేమ ఒక వేలు పట్టుకుంటుంది. ప్రేమ పట్టుకోగానే ఇదొక ఎనిమిదో వింత.. నేను అనుకున్నది నువ్వు సెలక్ట్ చేసావని ధీరజ్ అంటాడు. ఏం అనుకున్నావని ప్రేమ అడుగుతుంది. ఫుడ్ డెలివరి బాయ్ గా అనుకున్నా.. అదే నువ్వు సెలక్ట్ చేసావ్ అని ధీరజ్ అంటాడు. ఫుడ్ డెలివరి బాయ్ అంటే మన కాలేజీ వాళ్ళు చూస్తారేమోనని ప్రేమ అంటుంది.
చూస్తే ఏంటి మనం చేసే పని న్యాయంగా ఉంటే చాలు.. ఈ నెల నుండి పదివేలు ఇస్తానన్న కదా అని ధీరజ్ అంటాడు. ధీరజ్ లోపలికి వెళ్తాడు. చెయ్ నొప్పితో ఇబ్బంది పడుతుంటే ధీరజ్ పడుకున్నాక ప్రేమ అంటిమెంట్ రాస్తుంది. నిన్నోక బాధ్యత లేని మనిషి అనుకున్నాను కానీ నువ్వు బాధ్యతగల వాడివి అని ప్రేమ ధీరజ్ గురించి పాజిటివ్ గా అనుకుంటుంది. మరుసటిరోజు వేదవతి దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మీరు ముగ్గురు ఒకటి నేనొక్కదాన్ని ఒకటి.. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. నేను వచ్చేసరికి ఆపేస్తున్నారని శ్రీవల్లి అంటుంది. అదేం లేదు నర్మద ట్రైనింగ్ గురించి అని వేదవతి అంటుంది. ఇక వేదవతిని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి. వట్టి అమాయకురాలు అని శ్రీవల్లి గురించి వేదవతి అంటుంది.
మరొకవైపు నర్మద, ప్రేమ మాట్లాడుకుంటుంటే వేదవతి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని అంటుంది. ప్రేమ ఇంట్లోనే ఉండి చేసే జాబ్ గురించి ఆలోచిస్తున్నామని నర్మద అంటుంది. అలాగేనా ఆలోచించేది అని ఇలా ఆలోచించాలని వేదవతి చూపిస్తుంది. ఏదైనా ఐడియా వచ్చిందా అని వేదవతితో నర్మద అంటుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి.. మీరు ముగ్గురు ఒకటే దాని గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. ప్రేమ జాబ్ గురించి అని వేదవతి అనగానే.. అవునా అంటూ శ్రీవల్లి వేదవతి ముందు కూర్చొని వేదవతి చేతులు తన మీద వేసుకుంటుంది. అది చూసి మిగతా కోడళ్ళు అయిన ప్రేమ, నర్మద కుళ్ళుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |